రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీ కాశ్మీర్ టూ కన్యాకుమారి పాదయాత్ర..
గాంధీ,అంబెడ్కర్ ఆశయాలను కొనసాగించాలి..
పయనించే సూర్యడు // మార్చ్ // 27 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ రెండు నుండి జరిగే రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రీయ పాదయాత్ర కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు. గురువారం రోజున ఇళ్ళందకుంట మండల కేంద్రంలో పాదయాత్రకు సంబంధించిన మండల స్థాయి సమావేశాన్ని,నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ..దేశంలో బీజేపీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ బీజేపీ నాయకులు పార్లమెంట్ సాక్షిగా, అమిత్ షా అవమానించేలా మాట్లాడారని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరమని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ,రాజ్యాంగం కోసం బీ.ఆర్.అంబేద్కర్ కష్టపడ్డారని అలాంటి వారిని బీజేపీ విస్మరిస్తుందని అన్నారు. బీజేపి అవలంభిస్తున్న రాజ్యాంగ వ్యతిరేకవిధానాలను దేశమంతటా వివరించాలని వీధి,వీధికి ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని దానికి రాహుల్ గాంధీ పాదయాత్ర నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.