చోటాకూర్ మండల్ అందోల్ నియోజకవర్గం పయాణించే సూర్యుడు ఎర్రోళ్ల రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ చౌటకూరు మండల అధ్యక్షులు
సింగూర్ ఎక్స్ రోడ్లో గల చాయ్ చస్కా హోటల్ అక్రమ అడ్డగా మారి పోయింది. హోటల్ చుట్టుపక్క ప్రాంతాల్లో టాయిలెట్లు సరిగా లేక నిర్మానుషణంగా ఉన్న ప్రదేశంలో మలమూత్ర విసర్జన జరుగుతుంది. అంతేకాకుండా వ్యర్థ పదార్థాలతో నిండిపోవడం జరిగింది. అసలు ఏమీ పట్టనట్టుగా చూస్తూ పోతున్న అధికారులు.
చాయ్ చస్క యజమాన్యంపై వెంటనే ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసి, ప్రజలకు న్యాయం చేయవలసిందిగా అధికారులను కోరుతున్నాను. హోటల్ యాజమాన్యం సమయపాలన లేకుండా నిర్వహిస్తున్నారు. వేరే ప్రాంతం నుండి యువకులు వచ్చి కూర్చొని ఫోన్లో పలు గేములు ఆడుతూ సమయపాలన చేస్తూనారు. పలు వ్యక్తులు అడ్డగా చేసుకొని అక్రమ మట్టి త్రవ్వకాలు చేస్తున్నారు. సమయపాలన పాటించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు అడుగగా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని దౌర్జన్యంగా కేసులు పెడతామని బెదిరించడం జరుగుతుంది. కావున మండలంలో ఉన్న నాయకులు స్పందించి చాయ్ చస్క హోటల్ యాజమాన్యం సమయపాలన పాటించాలని వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల రమేష్ అన్నారు