
పయని0చే సూర్యుడు జూలై 27 ( సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్O దాసు) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామ సమీపంలోని స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో రాత్రింబవళ్లు ట్రాక్టర్ల ద్వారా భారీగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఒకప్పుడు ఇసుక నిల్వలకు పేరుగాంచిన స్వర్ణముఖి ప్రస్తుతం గుంటలు, రాళ్లు, పిచ్చిమొక్కలతో నిండిపోయిందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని సుమారు 65 బోర్వెల్స్తో పాటు మూడు మండలాలకు తాగునీరు అందించే పంపు బావులపై కూడా ఈ తవ్వకాల ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022లో హైకోర్టు స్టే వచ్చినా స్థానికంగా అక్రమ ఇసుక రవాణా మాత్రం ఆగలేదని వారు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రకృతి సంపదను కాపాడుతూ అక్రమ ఇసుక దందాను వెంటనే అరికట్టి, తాగునీరు మరియు సాగునీటి వనరులను పరిరక్షించాలని రైతులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.