పయనించే సూర్యుడు, జనవరి 31, జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత
జగ్గయ్యపేట,యన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న మండల తహశీల్దార్ కార్యాలయం ఇసుక డంపింగ్ యార్డ్ గా మారింది.జగ్గయ్యపేట ప్రాంతం రాష్ట్ర సరిహద్దు కావడంతో ఇసుక అక్రమ రవాణా అడ్డాగా మారుతుందని ప్రజలు తెలియజేస్తున్నారు.కాని దీనిని నివారించే మైనింగ్ మరియు గనుల శాఖ పట్టించుకోవడం లేకపోవడంతో అపఖ్యాతిని మూట కట్టుకుంటుంది.దీనితో రెవెన్యూ వారు ఇసుక అక్రమ రవాణాని నివారించడమే కాకుండా,అక్రమ ఇసుకను తహశీల్దార్ కార్యాలయానికి తరలించడంతో ఇసుక డంపింగ్ యార్డ్ గా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.దీనితో విశాలమైన తహశీల్దార్ కార్యాలయం కాస్తా ఇరుకుగా మారుతుంది.ఇప్పటికైన ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకొని ఇసుకను తహశీల్దార్ కార్యాలయం నుండి తొలగించి,ప్రజలకు అసౌకర్యాని గురికాకుండా చూడాలని పలువురు ప్రజలు కోరుతున్నారు