పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 11(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో దళితుడైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్.గవాయి పై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడంతో తాడిపత్రి నియోజకవర్గం పర్యటనలో భాగంగా యాడికి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశానికి సభాధ్యక్షు లు యాడికి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బాలు మాదిగ, వహించగా యాడికి మండల సమీక్ష సమావేశం యాడికి.పట్టణం చెన్నకేశవ స్వామి దేవాలయం నందు జరిగింది ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా ఇన్చార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ గారు విశిష్ట అతిథులుగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ యాడికి మండల ఉపాధ్యక్షులు చిరంజీవి మాదిగ,యాడికి మండల గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు మాదిగ ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ఇన్చార్జ్ ముమ్మిడి వరకు చిన్న సుబ్బారావు మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ, గారి ఆదేశాలు మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారిపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ అనంతపురం జిల్లాలో 13వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా ఈనెల 17న అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరపాలని ఈనెల 23 చలో అమరావతి భారీ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తాడపత్రి నియోజవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి దేవరాజ్ మాదిగ తాడిపత్రి నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ గాంధీ మాదిగ,తాడిపత్రి నియోజకవర్గ సీనియర్ నాయకులు పుల్లయ్య మాదిగ,యాడికి మండల సీనియర్ నాయకులు నరసింహులు మాదిగ, సూర్యుడు మాదిగ, రామాంజనేయులు మాదిగ, చిన్నరాముడు మాదిగ, లచ్చుంపల్లి రంగస్వామి మాదిగ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.