
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 19 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు డివిజన్ స్థాయిలో ఈనెల 21వ తేదీన విశ్వ కోయ భాషా దినోత్సవం చట్టి గ్రామపంచాయతీలో చట్టి లో కుమ్మూరు క్రాస్ రొడ్డ వద్ద ఉదయం 10 గంటలనుండి నిర్వహిస్తున్నట్టు డివిజన్ ఛైర్మెన్ జల్లి నరేష్ తెలియజేశారు. ఈ వేడుకల్లో కోయ భాషా సాహితీ కారులు, రేల పాట, ఆట కళాకారులూ, కోయ భాషా అభివృద్ధికి కృషిచేస్తున్న రచయితలు, ఇతర కళాకారులూ, కోయ గోండి ప్రామాణిక డిక్షనరీ రూపకర్తలు, ప్రతినిధులు డివిజన్లోని నాలుగు మండలాల స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు APAJAC నాయకులు భాగస్వామ్య సంఘాల, ఉద్యోగ, ఉపాధ్యాయ, యువజన, నిరుద్యోగ, మహిళా, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతినిధులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పత్రికా ముకంగా ఆహ్వానిస్తూ…ఆదివాసి సమాజానికి పిలుపునిచ్చారు.