పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా సి ఐ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగం గంగాధర్ తెలిపారు
గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు ఈ నెల 19 నుండి తమ హక్కుల సాధనకొరకు సమ్మె బాటపట్టనున్నట్లు గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘం (సి ఐ టీ యూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగం గంగాధర్ తెల్పినారు. నిజామాబాద్ - కామారెడ్డి (ఉమ్మడి జిల్లా) కమిటీ సమావేశం నిజామాబాద్ సి ఐ టీ యూ జిల్లా కార్యాలయంలో నాయకులు రాజేష్, బాలనర్సు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జంగం గంగాధర్ మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయితీ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెల్పినారు. కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అధిక పనిభారం, సెలవులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని వివరించారు. కనీసవేతనాలు 21000/- రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ సెలవులు అన్నిటినీ కార్మికులకు వర్తింపచేయాలని, ఆరోగ్యభీమ సౌకర్యం కల్పించాలని, పెరుగుతున్న గ్రామ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని తదితర డిమాండ్ తో సమ్మెకు దిగనున్నట్లు వారు తెల్పినరు. మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ… గ్రామాలలో శ్రామిక మహిళలు అధికంగా ఉన్నారని, వారిపైన అనేక వేధింపులు పెరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు ఐద్వా కృషిచేస్తున్నట్లు తెప్పినారు. గ్రామాలలో ఏదైనా దుర్ఘటన మహిళా పైన జరిగితే పంచాయితీ కార్మికులు తగిన బుద్ధి చెప్పేవిధంగా ఉండాలని ఆమె పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాయక్వాడి శ్రీనివాస్, సాగర్,గణేశ్,పద్మక్క, సునీత,వందన,తదితరులు పాల్గొన్నారు