పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 21,22,23వ తేదిలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ మరియు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విచ్చేయుచున్నారు. ఈ కార్యక్రమం 21వ తేదీనా ఉదయం 10గంటలకు నిజామాబాదులోని గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం పంట ఉత్పత్తులు, ఆధునిక యాంత్రీకరణ, ఆధునిక వంగడాలు, పసుపు ఆధారిత ఉత్పత్తులకు సంబదించిన పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు గురించి అవగాహన కల్పించానున్నారు.ఈ కార్యక్రమానికి శాస్రవేత్తలు, ప్రొపెసర్లు, వ్యవసాయ నిపుణులు హాజరు అవుతారు. కావున జిల్లాలోని రైతులందరు అధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి జిల్లాకు సంబందించిన ముఖ్య నాయకులు అధికారులు, వ్యవసాయ అధికారులు హాజరు అవుతారు. ఈ మూడు రోజులు జరగబోయే రైతు మహోత్సవ కార్యక్రమాన్ని విజవంతం చేయవలసిందిగా కోరుకుంటూ…