
/పయనించే సూర్యుడు// డిసెంబర్11 మక్తల్//మధ్వార్
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే గ్రామ సమగ్రాభివృద్ధికి చిత్త శు ద్ధితో కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి సక్రమొల్ల నరసింహ స్పష్టం చేశారు మక్తల్ మండల పరిధిలోన మధ్వార్ గ్రామంలో గురువారం ఇంటింటికి తిరిగి ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ప్రజలందరు భాగస్వాములు కావాలని ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మధ్వార్ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కోసం అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహకారాలు అందించాలని కోరారు గ్రామంలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని గతంలో ప్రజా ప్రతినిధులుగా పని చేసిన వారు గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టక పోవడంతోనే సమస్యలు పరిష్కారం కాలేదన్నారు గ్రామంలో రైతులు యువత విద్యార్థుల సమస్యలు ముఖ్యంగా త్రాగునీరు సిసి రోడ్లు డ్రైనేజీలు వీధిలైట్లు వంటిమౌలిక వసతుల కల్పన కోసం గత ప్రజా ప్రతినిధులు కృషి చేయలేదని తనను ఆదరించి గెలిపిస్తే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఆయన బరోసా ఇచ్చారు అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకే సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచాననిగ్రామస్థులు తనపై నమ్మకం ఉంచి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల కోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు గ్రామంలో చేసే అభివృద్ధిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నానని గెలిచిన వెంటనే ఒక్కొక్కటిగా పనులు పూర్తి చేసి ప్రజల ఆధారాభి మానాలు చూరగొంటానన్నారు. మధ్వార్ గ్రామ ప్రజలు అందరూ తనను ఆదరించి బ్యాలెట్ పేపర్లో పొందుపరిచిన క్రమ సంఖ్య ఒకటిలో ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని కోరారు ఎన్నికల ప్రచారంలో గ్రామం లోని అన్ని వార్డుల ప్రజలు తనను ఆదరిస్తున్నారని వారి ఆశలను వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధిగా కాకుండా మాధ్వార్ గ్రామ ప్రజల సేవకుడిగా అంకిత భావంతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు ఇ కార్యక్రమంలో గ్రామ నాయకులు గ్రామ యువకులు మహిళలు గ్రామస్థులు పాల్గొన్నారు

