పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 24//మక్తల్
జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన మారణకాండను నిరసిస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో అయ్యప్ప దేవాలయ కమిటీ, ఏబీవీపీ,VHP, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక వివేకానంద కూడలిలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని దీనిని యావత్ భారతదేశం ఖండిస్తుందని తెలిపారు.