పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 చౌడేపల్లి మండల ప్రతినిధి జే. నాగరాజ) స్థానిక సంత గేటు నందు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఉన్నత పాఠశాల 1988=89 పూర్వపు విద్యార్థులు ఆధ్వర్యంలో కుప్పం పిఇఎస్ వైద్య నిపుణులచే నిర్వహించిన ఈ శిబిరంలో మండల వ్యాప్తంగా 120 మంది రోగులు పాల్గొనగా వారిలో 20 మంది ఎంపికైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు 1988/89 పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు