//పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 11//మక్తల్
మక్తల్ నియోజకవర్గం గడ్డం పల్లి గ్రామ రైతు వేదికలో డా" వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆద్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యుల "శ్రీ డా"వాకిటి శ్రీహరి . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చుట్టూ పక్కల గ్రామ ప్రజలు కందూరు రామ్ రెడ్డి లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ఉచిత కంటి సేవలను కంటి చూపు సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.