
పయనించే సూర్యుడు నవంబర్ 1,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల జిల్లా పోలీస్ వారి కుటుంబాల సంక్షేమం కొరకు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు నంద్యాల పట్టణంలోని RK ఫంక్షన్ హాల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.అక్టోబర్ 21వ తేదీ నుండి 31 వ తారీకు వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ నంద్యాల రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి,జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N. యుగంధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ASP .జావళి, జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N. యుగంధర్ బాబు AR డి.ఎస్.పి శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి ,ఇన్స్పెక్టర్లు జీవన గంగనాథ్ బాబు , ఈశ్వరయ్య, కృష్ణయ్య స్వయంగా రక్తదానం చేసి శిబిరానికి వచ్చిన వారికి ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా 32 మంది పోలీసు అధికారులు వారి సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడంతో పాటు నంద్యాల SVR ఇంజనీరింగ్ కళాశాల ,గవర్నమెంట్ కాలేజ్ ,రామకృష్ణ కాలేజ్, RGM కాలేజ్ ల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని స్వచ్ఛందంగా 148 మంది రక్తదానం చేశారు.నంద్యాల శాంతిరాం హాస్పిటల్ వారి సౌజన్యంతో సుమారు 147 నంద్యాల పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు ఆర్తో ,జనరల్ మెడిసిన్ ,గైనకాలజిస్ట్, గుండెకు సంబంధించి నిష్ణాతులైన డాక్టర్ల సమక్షంలో BP, షుగర్, 2D ECHO, ECG మొదలగు పరీక్షలను ఉచితంగా చేయడంతో పాటు ఏదైనా ఆరోగ్య సమస్యఉంటే తగిన సూచనలు చేయడంతో పాటు ప్రాథమిక దశలోనే సరైన చికిత్స చేసుకోవాలని పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ASP మంద జావళి,, జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N యుగంధర్ బాబుతో పాటు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, AR డిఎస్పి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు కంబగిరి రాముడు, ఈశ్వరయ్య, జీవన్ గంగనాథ్ బాబు, కృష్ణయ్య రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్ సురేష్ బాబు, రెడ్ క్రాస్ సొసైటీ వారి నుండి దస్తగిరి బాబు, కవిత వారి సిబ్బంది, పోలీసు పాల్గొన్నారు.