రాయపల్లి అంబేద్కర్ సంఘం సభ్యుల సమక్షంలో సత్కారం
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15,మహబూబ్ నగర్ జిల్లా, రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగే కళా శేఖర్:
రాజాపూర్ మండలం రాయపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జి విజయలక్ష్మి కి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్న సందర్బంగా రాయపల్లి గ్రామం అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు శాలువా తో సత్కరించారు. అంబేద్కర్ సంఘము అధ్యక్షులు నరిగే కళా శేఖర్ మాట్లాడుతూ రాయపల్లి గ్రామ పాఠశాల లో ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు రావడం చాలా సంతోశం అన్నారు. ప్రభుత్వ పాఠశాల లో పనిచేసే ఉపాధ్యాయులు ఏమాత్రం తీసిపోకుండా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అంగ్లం, తెలుగు మాధ్యమాలలో పిల్లల్లను చురుగ్గా మాట్లాడేటట్టు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల హెడ్ మాస్టర్ రంజిత్,అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నరిగే కళా శేఖర్, ఉపాధ్యక్షులు రావుల యాదయ్య, కోశాధికారి నరిగే రాజు, సభ్యులు నరిగే ప్లాట్ల శ్రీను, మహేష్, తిరుపతి పాల్గొన్నారు.