---------కన్నుల పండుగగా అవార్డుల ప్రధానం
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 3 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా….. అనంతపురం వేదికగా 7వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు రషీద్ భాష ఆధ్వర్యంలో ఆదివారం రోజు అనంత కన్వెన్షన్ హాల్ లో జిల్లా లోని వివిధ ప్రాంతాలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు పుర ప్రముఖుల సమక్షంలో 18 విభాగాల్లో కన్నుల పండుగగా జరిగింది.
యీ కార్యక్రమంలో జి యం యస్ గ్యాలరీ ఫిలిమ్స్ వాళ్ళు 12 కథల్లో పోటీ పడిన 4 కథలలో "పబ్లిక్ టాయిలెట్ లేక మహిళలు పడుతున్న ఇబ్బందుల పై " తయారు చేసిన స్క్రిప్ట్ మొదటి బహుమతి రు. 50,000/- బడ్జెట్ గెలుచుకుంది.
18 విభాగాల్లో అవార్డులు గెలుపొందిన వారికి పుర ప్రముఖుల చేతులమీదుగా అవార్డుల ప్రదానం జరిగింది.
ఈ కార్యక్రమం లో 50 సంవత్సరాలుగా కెమెరామెన్ గా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు, వేంకటేశ్వర రావు( స్క్రిప్ట్ రైటర్) , శ్రీ వెంకట్ కట్టా (వైస్ ప్రెసిడెంట్ , హారన్ బిల్ , సూర్య నారాయణ ఆర్డిఓ, ఆర్డిటి, సూర్యనారాయణ రైటర్, జి యస్ రెడ్డి (అమెరికా తెలుగు అసోసియేషన్ ) గోపాలకృష్ణ ఎస్బిఐ రిటైర్డ్ పాటు జే యల్ మురళీ (అనంతపురం టౌన్ బ్యాంక్), ముడార్ సుధీ ర్ సుబ్రమణ్యం (అనంత రియాల్టీ ), సుధాకర్ (ప్రొడ్యూసర్) విజయ సాయి (సాయి ట్రస్ట్) డిస్కవరీ అనంతపురం అనిల్ కుమార్ , జై కిసాన్ నాగమల్లి ఓబులేసు , ట్రినిటీ హాస్పిటల్ విజయ్ కుమార్ , శివరం లాడ్జి రాఘవేంద్ర , రమణ తో పాటుగా అనంతపురం ఫిల్మ్ సొసైటీ సభ్యులు, కంబదూరి నబీ రసూల్, తోట బాలాన్న, హోన్నూరప్ప, తెలుగు వెలుగు టీవీ రెడ్డి , డి 3 దాదు యాంకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
డ్యాన్స్ మాస్టర్ కత్తి విజయ కుమార్, హరి కొరియోగ్రఫీ చేసిన పాటలు, కోలాట నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.
నిన్న (2 వ తేదీ ) అనంత కాన్వెంషన్ హాల్,అనంతపురం నందు జరిగిన 7 వ అనంత ఫిల్మ్ ఫెస్టివల్ నందు జి ఎం ఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ ఛానల్ లో గత సంవత్సరం రిలీజ్ అయిన చిత్రాలకు గాను 5 అవార్డులను సొంతం చేసుకొంది..ఉత్తమ ప్రొడ్యూసర్ గా జిఎం. సురేష్ మరియు ఉత్తమ చిత్రం గా శ్రీరస్తు ఉత్తమ డైరెక్టర్ మరియు హీరోయిన్ గా కృష్ణ సత్యభామ చిత్రానికి , మ్యూజిక్ డైరెక్టర్ గా అంజి పామిడి మళ్ళీ మొదలైంది చిత్రానికి అవార్డ్ లు రావడం చాలా ఆనందంగా ఉంది.. వారు తెలిపారు