పయనించే సూర్యుడు జనవరి 17( పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి) పాల్వంచ టౌన్: తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని, వారిని ఆదుకుంటామని సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. శుక్రవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో జై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీ.పీ. ఐ పార్టీ భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఎమ్మెల్యే కూనమ నేని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు జాబితాలో అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సాబీర్ పాషా ను ఉద్యమకారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సయ్యద్ రషీద్, సంఘం సభ్యులు ఉబ్బె న శ్రీను ,ఎస్కే గౌస్, మోటపోతుల జయరాజు, మహమ్మద్ సద్దాం, తంగేటి రాము, షేక్ అసిఫ్ ,పాషా ఎస్.కె నయీమ్, పఠాన్ సత్తార్, బోగిని సందీప్, ఎన్న నివాస్, ఇబ్రహీం, ఇమ్రాన్ ,సోహెల్ ,అక్రమ్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు