ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్
ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
( పయనించే సూర్యుడు జనవరి 31 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )
ఉద్యమాలకు ఊపిరి పోసిన ఉద్యమ కెరటం ప్రజానాక గద్దర్ అని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ అఖిలభారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో గద్దర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. షాద్ నగర్ పట్టణ అంబేద్కర్ చౌరస్తాలో గద్దర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆకాష్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. పీడిత ప్రజలను చైతన్యం చేసిన యుద్ధ వీరుడు ప్రజా యుద్ధనౌక గద్దర్ అని కొనియాడారు. 77వ జయంతి శుభాకాంక్షలు అంటూ పిలుపునిచ్చారు. తెలంగాణలో అగ్రకుల దోపిడీ పెత్తందారి భూస్వాముల అధిపత్యం, రాజ్యాధికారం, అహంకారం కింద నలిగిపోతున్న అనేక పేద ప్రజల హక్కుల కోసం స్వేచ్ఛ జీవితం కోసం భూమి కోసం విముక్తి కోసం నిరంతరం పీడిత ప్రజల కోసం ఎర్రని విప్లవదారుల్లో పోరాటం చేసిన ఎర్రని సూర్యుడు యుద్ధ వీరుడు గద్దర్ అని కీర్తించారు. తన కలం, గలంతో గద్దర్ తెలంగాణ మళ్లీ దశ ఉద్యమంలో తన పాటలతో తెలంగాణ ప్రజలను చైతన్యం కల్పించి ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రజా గాయకుడు గద్దర్ అని పేర్కొన్నారు. అలాగే
గద్దర్ కేవలం ప్రజాకవి మాత్రమే కాదు తెలంగాణ ప్రజల స్వరాన్ని ప్రపంచానికి వినిపించిన గొంతుక అని పిలుస్తారన్నారు. ఇలాంటి ప్రజాయుద్ధం ఒక గద్దర్ ను స్మరించుకుంటూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన సాహిత్యం ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి బాసటగా విప్లవ కవి గాయకుడు గద్దర్ నిలిచారని కొనియాడారు. నేడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, వారి పేరుతో అవార్డు నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని కోరుకుంటున్నట్టు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు