ఉన్నతాధికారుల ఉదార స్వభావం…. మండల ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల కొరత పయనించే సూర్యడు న్యూస్. కొయ్యూరు,న్యూస్ : రిపోర్టర్ :( చల్లంగి వినోద్ ) అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలకేంద్రం, రాజేంద్రపాలెం పీహెచ్సీలో డాక్టర్ల కొరత కారణంగా తెలిసి తెలియని నర్సుల వైద్యంతో కొంతమంది రోగులకు రోగాలు వెన్నంటుతున్నాయి. సక్రమంగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మనోజ్ఞను బదిలీ చేశారు. వారానికి ఒక్కరోజు, అది యును వీలైనప్పుడు , మైదాన ప్రాంతాల నుండి నామమాత్రంగా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తున్న డాక్టర్ ను మండల కేంద్ర ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా కొనసాగిస్తూ, అధికారులు ఉదార స్వభావం చూపించడం గమనార్హం.ఈ పరిస్థితులలో సకాలంలో డాక్టర్ సేవలు రోగులకు అందడం లేదు. అత్యవసర పరిస్థితులలో మైదన ప్రాంతంలో మఖామ్ ఉంటున్న డాక్టర్ ఫోన్ సలహా ద్వారా నర్సులు వైద్యం చేస్తున్నారు. ఈ పద్ధతి మండల ఆరోగ్య కేంద్రంలో సంవత్సరాలు తరబడి కొనసాగుతుంది. సంబంధిత ఉన్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ, సహకరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మండల కేంద్ర పిహెచ్సిలో డాక్టర్ వైద్య సేవలు కరువైనప్పటికీ సంబంధిత ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం దురదృష్టం.ఈ మండల కేంద్ర ఆరోగ్య కేంద్రానికి చుట్టుపక్కల కొయ్యూరు, మంప, రేవళ్లు, గంగవరం,పైడిపనుకుల,మర్రివాడ,బూదరాళ్ల, చీడి పాలెం మొదలగు పలు పంచాయతీల నుండి ప్రతిరోజు వందల సంఖ్యలో వైద్యం నిమిత్తం రోగులు వస్తుంటారు . ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ల కొరత ఏర్పడడం శోచనీయం.ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి మైదాన ప్రాంతాలలో మకాం ఉంటూ, సక్రమంగా విధులు నిర్వహించలేని డాక్టరు ను బదిలీ చేసి, ఆరోగ్య కేంద్రానికి అందుబాటులో ఉంటూ క్రమం తప్పకుండా విధులు నిర్వహించగలిగిన డాక్టర్లను మండల కేంద్ర ఆరోగ్య కేంద్రంలో నియమించాలని కొంతమంది రాజకీయ నాయకులు, పలువు మండల వాసులు కోరుకుంటున్నారు.