
గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారి ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన పలువురు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం కలిశారు. తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో పల్లెపండగ 2.0, సాస్కీ నిధులతో రోడ్లు, డ్రెయిన్లతోపాటు జేజేఎం నిధులతో రక్షిత మంచినీటి పథకాల పనులు, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం శాసనసభలో జరిగిన ఎన్డీఏ ఎల్పీ భేటీ అనంతరం వీరంతా శ్రీ పవన్ కళ్యాణ్ వారిని కలిశారు. కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు , మండపేట శాసనసభ్యులు శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు , ముమ్మడివరం శాసన సభ్యులు& ప్రభుత్వం విప్ దాట్ల సుబ్బరాజు అమలాపురం శాసన సభ్యులు శ్రీ అయితాబత్తుల ఆనందరావుతదితరులు ఉప ముఖ్యమంత్రివర్యులను కలసిన వారిలో ఉన్నారు.రూ. 65.15 కోట్ల సాస్కీ నిధులతో 4 నియోజకవర్గాల్లో 40 రోడ్ల అభివృద్ధి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో రూ. 65.15 కోట్ల సాస్కీ నిధులతో 40 ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో మండపేట నియోజకవర్గానికి రూ. 22.75 కోట్లు, అమలాపురం నియోజకవర్గానికి రూ. 16.18 కోట్లు, కొత్తపేటకు రూ. 14.93 కోట్లు, ముమ్మిడివరం నియోజకవర్గానికి రూ. 11.28 కోట్లు కేటాయించారు. 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి వాడపల్లి క్షేత్రానికి వెళ్లే కరకట్ట రోడ్డు నిర్మాణానికి స్థానిక శాసన సభ్యులు సత్యానందరావు వారి అభ్యర్ధన మేరకు సాస్కీ నిధుల నుంచే రూ. 6 కోట్లు శ్రీ పవన్ కళ్యాణ్ మంజూరు చేశారు.పలువురు ప్రజా ప్రతినిధులు భేటీ శాసన సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారి ని పలువురు శాసన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల పరిధిలో పలు సమస్యలను పవన్ కళ్యాణ్ వారి దృష్టికి తీసుకువచ్చారు.