పయనించే సూర్యుడు( ప్రతినిధి) అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం ఫిబ్రవరి20 సుండుపల్లి మండల కేంద్రంలోని సచివాలయం 2 పరిధిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఖాళీ అవడంతో సోమలరాజుగారి పల్లికు చెందిన రుద్రరాజు ప్రసాద్ రాజు కుమారుడు భరత్ కుమార్ రాజు,కు నియామక పత్రాన్ని మండల అభివృద్ధి అధికారి సుధాకర్ రెడ్డి అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో అవకతవకలు లేకుండా ప్రజలకు పని దినాలను కల్పించాలన్నారు, ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయని ప్రభుత్వానికి మంచి పేరు సుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కల్లేరెడ్డప్ప మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రాజు, టిడిపి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మాలేపాటి శివరాం నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షుడు సురేష్ నాయుడు, దిలీప్ రాజు,మస్తాన్, టిడిపి మండల ఛాంపియన్ ఎల్ వి రమణ, టిడిపి మండల బీసీ సెల్ అధ్యక్షుడు బెల్లాల రమణ, గ్రామ అధ్యక్షుడు సుబ్బారాము తదితరులు పాల్గొన్నారు.