పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 18
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఉపాధి హామీ కూలీలకు ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశంలో ఉపాధి హామీ కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి మజ్జిగ టెంటు వాటర్ మెడికల్ కిట్టు సౌకర్యాలు కల్పించాలి. రోజురోజుకీ ఎండ తీరత పెరుగుతున్న సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు 10 నెలల నుండి పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి. చెల్లించలేని పక్షంలో ఉపాధి హామీ కూలీలని అందరిని కూడా ఐక్యం చేసి ఆందోళన చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు సిసం సురేష్. పొడియం లక్ష్మణ్. మల్లం సుబ్బమ్మ. సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు చింత రాంబాబు. సవలం కన్నయ్య. నాయకులు మడివి రాజేష్. సవలం దేశయ్య. నాగమణి. సత్తిబాబు. తదితరులు పాల్గొన్నారు