పయనించే సూర్యుడు: ఫిబ్రవరి 18: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ వాజేడు: ఉపాధ్యాయులు సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలని ములుగు జిల్లా విద్యాశాఖ ఏ ఎం ఓ మల్లారెడ్డి అన్నారు. వాజేడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఇంటర్ ఆక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ట్రైనింగ్ లో పాల్గొన్న మల్లారెడ్డి ఐదు మండలాల (వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, ఏటూరు నాగారం,మంగపేట) ఉపాధ్యాయులకు పలు సూచనలు అందజేశారు. రానున్న కాలమంతా ఇంటర్నెట్ అనుసంధానంగా జరుగుతుందని దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు శాస్త్ర సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.శిక్షణ కేంద్రంలో ఇచ్చే సూచనలు పాఠశాలలో పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.అదేవిదంగా విద్యార్థులకు కూడా పాఠాలు చక్కగా అర్థమవుతాయని ఉపాధ్యాయులకు పనిభారం తగ్గుతుందని కాబట్టి ఉపాధ్యాయులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఐ.ఎఫ్.పి.విద్యార్థులకు ఉపయోగకరం వాజేడు ఎం.ఇ.ఒ.తేజావత్ వెంకటేశ్వరరావు ఇంటరాక్టు ఫ్లాట్ ప్యానెల్ విద్యార్థులకు చాలా ఉపయోగకరమని వాజేడు మండల విద్యాధికారి తేజావత్ వెంకటేశ్వరరావు అన్నారు.ఈ సమావేశంలో ఇంటర్ యాక్ట్ ప్లాట్ ప్యానెల్ వినియోగం నిర్వహణ అనే అంశంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ ఫ్లాట్ ప్యానెల్ లో విద్యార్థులకు అభ్యసన సులభం అవుతుందని ఎంఈఓ అన్నారు. ఉపాధ్యాయులందరూ ప్లాట్ ప్యానెల్ నిర్వహణ గురించి తెలుసుకొని ఫ్లాట్ ప్యానెల్ ను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులకు బోధన సులభం ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు ఇంటరాక్టు ఫ్లాట్ ప్యానెల్ తో ఉపాధ్యాయులకు బోధన సులభం అవుతుందని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు అన్నారు. సమయం వృధా కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను ప్లాట్ ప్యానెల్ ద్వారా విద్యార్థులకు అందించవచ్చు అని ఆనందరావు అన్నారు. ఫ్లాట్ ప్యానెల్ ద్వారా ఉపాధ్యాయులకు సమయం మిగులుతుందని ఈ అదనపు సమయాన్ని విద్యార్థుల అభివృద్ధికి పయోగపడుతుందని అన్నారు. ఎటువంటి సందేహాలు లేకుండా ఉపాధ్యాయులు రిసోర్స్ పర్సన్స్ ద్వారా పూర్తి సమాచారాన్ని పొందాలని ఆనందరావు తెలియజేశారు. ఈయొక్క కార్యక్రమంలో హిందీ రిసోర్స్ పర్సన్ లు పొరిక స్వరూప్ సింగ్ జాకీర్ అలీ లకావత్ బాలాజీ ఐదు మండలాలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.