బీశ్వ క్రిష్ణయ్య ఉద్యోగ పదివి విరమణ సన్మానోత్సవ కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బీశ్వ క్రిష్ణయ్య
పయనించే సూర్యుడు మార్చి 26 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) ప్రతి విద్యార్ధి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర చిరస్మరణీయంగా నిలిచి పోతుంది అని ఎమ్మెల్సి నాగర కుంట నవీన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరుక్ నగర్ మండలం రాయికల్ గ్రామ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పదవి విరమణ పొందుతున్న బీశ్వ క్రిష్ణయ్య ఉద్యోగ పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బీశ్వ క్రిష్ణయ్య.ఈ సందర్బంగా పదవి విరమణ పొందుతున్న బీశ్వ క్రిష్ణయ్యను సన్మానించారు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి.ఈ కార్యక్రమం లో సభాధ్యక్షులు కే శారద ,హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు జయ్యమ్మా, యూటీఫ్ జిల్లా అధ్యక్షులు వెంకటప్ప,ప్యాక్ ఛైర్మెన్ బక్కన యాదవ్ మాజీఎంపీటీసీలు బిశ్వ రామక్రిష్ణ,అరుణ వెంకట్ రెడ్డి, నాయకులు విష్ణు గౌడ్,వెంకటేష్,శ్రీను, వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.