
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాజోలు నియోజకవర్గం లో 13 గ్రామాలలో కొబ్బరి మొక్కలు ఎండిపోతున్న విషయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళడంతో బడ్జెట్లో ప్రోత్సాహకాలు ప్రకటించడం హర్షనీయమని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో 13 గ్రామాలలో రెండు లక్షలకు పైగా కొబ్బరి చెట్లు ఎండిపోయిన విషయాన్ని రైతులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింద న్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడి 'మేమున్నామంటూ' భరోసాను ఇవ్వడం జరిగిందన్నారు. ఆ దిశగా రూ. 21 కోట్లతో సిల్టు తొలగింపు తదితర పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేయించారని అన్నారు. సదరు సమస్యను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లడంతో బడ్జెట్లో కొబ్బరి పంటలకి పెద్దపీట వేసి రైతులకు అండగా ప్రోత్సాహకాలు ప్రకటించడం జరిగిందన్నారు. ఉత్పాదకత ఇవ్వని కొబ్బరి చెట్లను తొలగించి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటి ఉత్పత్తి పెంచడానికి బడ్జెట్లో ప్రోత్సాహకాలు ప్రకటించడం జరిగిందన్నారు. వాగ్దానాలు కంటే ప్రత్యక్షమైన పనులతో ప్రజలకు మేలు జరగాలనే ఆకాంక్షతో ఉన్న పవన్ కళ్యాణ్ సదరు సమస్యను ప్రపంచ బ్యాంకు అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ప్రజలతో ప్రతిధ్వనించే సమస్యలపై దృష్టి కేంద్రీకరించి ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ నిబద్ధత ప్రశంసనీయమని అడబాల అన్నారు.