పయనించే సూర్యుడు అక్టోబర్ 4 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ : ఖమ్మం జిల్లా నూకలం పాడులో 20 ఏండ్లుగా విచిత్ర పరిస్థితి షెడ్యూల్డ్ ఏరియా కావడంతో సర్పంచ్ పదవి,ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడం ఉపసర్పంచ్గా ఎన్నికైన వ్యక్తికే సర్పంచ్ బాధ్యతలు ఏన్కూరు మండలం : షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించిన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీలకు కేటాయించినప్పటికీ… ఊర్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో 20 ఏండ్లుగా ఉపసర్పంచ్గా గెలిచిన వ్యక్తికే సర్పంచ్ అధికారాలు అప్పగిస్తున్నారు. గత నాలుగు టర్మ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా.. ఈ సారి కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది.