
పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం ఉలవపల్లి గ్రామం లో డ్రోన్ తో పురుగు మందును చల్లటం రైతులకు అవగాహన కల్పించి చూపించటం జరిగింది. ఒక రోజు ఒక కూలి మనిషి పురుగు మందు స్ప్రే చేయాలకుంటే , 4 నుంచి 5 ఎకరాలు చేయగలడు. ఆ స్ప్రే చేయడానికి , మరొక కూలి మనిషి నీరు పోయడానికి అవసరం అవుతుంది.ఎకరానికి కూలి ఇద్దరికీ కలిపి 450 రూపాయలు ఖర్చు అవుతుంది .కానీ డ్రోన్ తో అయితే మధ్యాహ్నానికి 15 ఎకరాలు పురుగు మందు స్ప్రే చేయవచ్చు.మందు మోతాదు ఎకరానికి 1 లీటరు అనుకుంటే 25 శాతం మందు ఆదా అవుతుంది.పైరంత సమంగా స్ప్రే చేస్తుంది.తక్కువ సమయంలో ఎక్కువ పొలం స్ప్రే చేయడానికి ఉపయోగ పడుతుంది . మండల వ్యవసాయ అధికారి హిమ బిందు మంగళవారం తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు