పయనించే సూర్యుడు. ఏప్రిల్ 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
పదవీ విరమణ సందర్భంగా ఎంపీడీవో సకినాల రమేష్ దంపతులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు టిడబ్ల్యూజేఎఫ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్) ఏన్కూర్ మండల సభ్యులు. ఎంపీడీవోగా రమేష్ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, ఆయన సేవా మార్గదర్శకత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని జర్నలిస్టులు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమాచారి, నవతెలంగాణ రిపోర్టర్ బి. గోపికృష్ణ, అక్షిత మీడియా రిపోర్టర్ ఎం. గోపాల్ రావు, పయనించే సూర్యుడు జిల్లా బ్యూరో ప్రతినిధి మరియు సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ , మన ప్రగతి న్యూస్ రిపోర్టర్ ఎలుగోటి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.