
పయనించే సూర్యుడు జనవరి 09,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల పట్టణం బొమ్మలసత్రం లోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో శుక్రవారం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరిని నంద్యాల ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిచి 2026 నూతన ఆంగ్ల నామ శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని మర్యాద పూర్వకంగా కలిసిన వారిలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ప్రధమనందీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ సి. వెంకట చలం బాబు, పాలకమండలి సభ్యులు, శ్రీశైల దేవస్థానం పాలకమండలి డైరెక్టర్ జిల్లెల్ల శ్రీదేవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి. జిల్లెల్ల శ్రీరాములు, నంద్యాల పార్లమెంట్ జనసేన ఇంచార్జి భవనాసి శ్రీనివాసులు ( భవనాసి వాసు), సీనియర్ న్యాయవాది, మాజీ సిపిఎం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. శంకరయ్య.మూలమఠం శ్రీ భీమలింగేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పసుపులేటి నారాయణ, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు పులి కొండన్న, నంద్యాల మార్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున గుప్తా, ఆర్యవైశ్య సంఘం నంద్యాల జిల్లా నాయకులు భవనాసి మహేష్, మారం. వినయ్, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, చక్రధర్, గోస్పాడు మండల టీడీపీ కన్వీనర్ కాటంరెడ్డి తులశీశ్వరరెడ్డి, బి ఎస్ ఎన్ ఎన్ సలహా కమిటీ మెంబర్ పెరుమాళ్ళ విజయకుమార్ తదితరులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని మర్యాద పూర్వకంగా కలిసి కొన్ని సమస్యలు ఆమె దృష్టికి తెచ్చారు. వాటిని పరిష్కరిస్థానని ఆమె హామీ ఇచ్చారు.