
పయనించే సూర్యుడు జనవరి 07,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.
నంద్యాల జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి భారీ :మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.బుధవారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ వికాస శిక్షణ ప్లేస్మెంట్ సంస్థల సహకారంతో ఈ నెల 9వ తేదీన శుక్రవా రం నంద్యాల పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో ఉన్న శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహస్తున్నామన్నారు.ఈ జాబ్ మేళాలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన టెక్ మహీంద్రా, టాటా ఎలక్ట్రానిక్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ప్రీమియర్ ఎనర్జీస్ వంటి దిగ్గజ సంస్థలు పాల్గొంటున్నాయనీ, మొత్తం 800 ఖాళీలను ఈ జాబ్ మేళా వేదిక ద్వారా భర్తీ చేయనున్నట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.