
పయనించే సూర్యుడుD.25.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల కేంద్రంలోభీమ్గల్: 25,ఆగస్టు.ఇందూర్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ భీమ్గల్ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ ఆధ్వర్యంలో భీమ్గల్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం స్వామివారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా బీజేపీ భీమ్గల్ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అరవింద్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు 278 మంది చిన్నారులకు హృదయ సంబంధిత వైద్య సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడిన ప్రాణదాతగా నిలిచారని కొనియాడారు.అదేవిధంగా బీజేపీ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ADF ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్న గొప్ప నాయకుడు ధర్మపురి అరవింద్ అని పేర్కొన్నారు.ప్రజా సేవే లక్ష్యంగా, కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్ కి భీమ్గల్ మండల బీజేపీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, మరింత ప్రజాసేవ చేసే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య,కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తోట గంగాధర్,యువ మోర్చా అధ్యక్షులు శెట్టి ప్రేమ్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ,పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు నీలం గంగాధర్, దయ్య ప్రవీణ్, కొండ గంగాధర్,బూత్ అధ్యక్షులు బాబురావు, బుదన్న, గంగాధర్,బావన్న,కళ్ళేడ గిరిధర్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు..