కళ్యాణానికి హాజరైన బీఆర్ఎస్ యువనాయకులు వై. రవీందర్ యాదవ్ దంపతులు..
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మేఘవాత్ నరేందర్ నాయక్) కేశంపేట మండల పరిధిలోని ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో శనివారం శివ పార్వతుల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య శివపార్వతుల కల్యాణం కనులపండువగా జరిగింది. బీఆర్ఎస్ యువనాయకులు వై. రవీందర్ యాదవ్ దంపతులు తదితరులు కళ్యాణంలో కూర్చున్నారు. స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొనడంతోపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వేదపండితులు రవీందర్ యాదవ్ దంపతులను ఆశీర్వదించారు.