పయనించే సూర్యుడు మే 5 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లెమండలం
ఎక్స్పైర్ అయ్యి 8 నెలలు 9 నెలలు అవుతున్న కూడా విచ్చలవిడిగా అమ్మకాలు
ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీ చేసిన దాఖలా లేదు
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలో ఎక్స్పైర్ అయిపోయిన కూల్ డ్రింక్ పాలు పెరుగు కుర్కురే లు విచ్చలవిడిగా అమ్మకాలు సుండుపల్లి అగ్రహారం ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన కిరాణా షాప్ వద్ద ఎక్స్పైరీ డేట్ కురుకురేలు. పాలు పెరుగు. కూల్ డ్రింక్ అమ్ముతున్న నేపథ్యంలో నిన్న రాత్రి పాలు పెరుగు కోసం ఆ కిరాణా షాపు వద్దకు వెళ్లగా అన్ని టైం అయిపోయినటి అమ్మకాలు చేస్తున్నారని కిరాణా షాప్ యజమాని అని అడగగా కిరాణా షాప్ యాజమాన్యం అవును అమ్ముతున్నాము ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి మేము అమ్ముతున్నాము మా దగ్గర ఇవే ఉన్నాయి ఇష్టం ఉంటే కొనండి లేకుంటే వెళ్ళండి అని చాలా నిర్లక్ష్యంగా కిరాణా షాప్ యజమాన్యం చాలా దురుసుగా ప్రవర్తించారని కస్టమర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇది కేవలం ఒక కిరాణా షాప్ లోనే కాకుండా మండల కేంద్రంలో చాలా కిరాణా షాపులో అలాగే జరుగుతున్నాయని ఫుడ్ అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని ఎక్స్పైర్ అయిపోయినీటి అన్ని చాలా కిరాణా షాప్ లో ఉన్నాయని దానివల్ల ప్రజలకు ఎంతో ప్రమాదం గా ఉందని అవి తినడం వల్ల ప్రజలకు ఎంతగానో హాని కలుగుతుందని మండల కేంద్రంలో చాలా కిరాణా షాపులలో విచ్చలవిడిగా ఎక్స్పైరీ డేట్లు అమ్మకాల జరుగుతున్నాయని దీనిపై తక్షణమే ఫుడ్ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు