పయనించే సూర్యుడు,ఏప్రిల్ 9,అశ్వాపురం, పినపాక నియోజకవర్గ ప్రతినిధి:
అశ్వాపురం మండలంలోని అశ్వాపురంలోని ఎక్స్ లెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు బుధవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్ లెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్,ఎం డి యూసఫ్ మాట్లాడుతూ పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ, నిబంధన కలిగి ఉండాలని భవిష్యత్తులో ఉన్న స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం డైరెక్టర్ ఎం డి యాకూబ్ షరీఫ్ మాట్లాడుతూ పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలతో ఉండే సమాజంలో మంచి పేరు సాధించుకోవాలని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయి చేరుకోవాలని ఆశపడతారని వారి ఆశలు సఫలం చేయడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, పిల్లలకు గ్రాడ్యుయేషన్ పట్టాలు ఇచ్చి వారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లెనిన్ విజయకుమార్,ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాల్లు,విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.