ప్రసాద్ ఫిలిం ల్యాబ్ నందు సినిమాను వీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు
( పయనించే సూర్యుడు మే 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) సామాజిక సంస్కర్త మరియు రచయిత, మహాత్మా జ్యోతిరావు ఫూలే మరియు అతని భార్య మరియు సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫూలే ఆధారంగా రూపొందించబడిన బాలీవుడ్ బయోపిక్ ఫూలే, అనేక వివాదాల తర్వాత ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది.ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ మరియు పత్రలేఖ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ సలహాదారు కేశవ రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్,ఆది శ్రీనివాస్,కాలేరు వెంకటేష్,ప్రకాష్ గౌడ్, బీసీ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.