
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
కలివెలుగుల చక్రపాణి ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మల్లన్న జాతరకు ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భక్తిశ్రద్ధలతో మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి బెల్లం ముద్దులతో తులాభారం నిర్వహించారు.అనంతరం జాతరలో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*
