పయనించే సూర్యుడు జనవరి 17, కాకినాడ జిల్లా ప్రతినిధి (బి వి బి)కరప మండలం అరట్లకట్ట గ్రామంలో వేంచేసియున్న ‘శ్రీ అభయ కోదండ రామాలయం’లో 8వ శ్రీరామ సప్తాహ మహోత్సవ కార్యక్రమాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 10వ తేదీ నుండి జరుగుతున్న 8వ శ్రీరామ సప్తాహ మహోత్సవాల ముగింపులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రామాచార్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించగా గ్రామానికి చెందిన సోడగం సూరిబాబు విజయ వెంకటలక్ష్మీ దంపతులు పీటల పై కూర్చుని వారి చేతులమీదుగా పవలింపుసేవనునిర్వహించారు. ఈ సంధర్భంగా శ్రీ విఘ్నేశ్వర భజనబృంధం సభ్యులు కొర్ల వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ‘శ్రీ అభయ కోదండ రామాలయం’లో 8వ శ్రీరామ సప్తాహ మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, లోక కళ్యాణార్ధం, గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ స్వామి వారికి ఈ ఉత్సవాలను గత 7 సంవత్సరాలుగానిర్విరామంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఈ సంవత్సరం 8వ శ్రీరామ సప్తాహ మహోత్సవాలను భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్ లో ఈ ఉత్సవాలను మరింత వైభవోపేతంగా నిర్వహించుకునేవిధంగా ఆ స్వామి వారి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చింత గంగాధర్, వైస్ చైర్మన్ అడపా నాగబాబు, రెడ్డి దొరబాబు, వినుకొండ శ్రీనివాస్, మల్లిపూడి శ్రీనివాస్, చిక్కాల రామకృష్ణ, నక్క రాంబాబు తదితరులు పాల్గొన్నారు