పయనించే సూర్యుడు, జనవరి 17(వైరా నియోజకవర్గ రిపోర్టర్ ఆదూరి ఆనందం )తల్లాడ మండలం,అన్నారుగూడెం గ్రామానికి చెందిన ఎస్ న్యూస్ అధినేత శ్రీనివాసరావు ఎన్జీవో కొంతకాలం నుంచి అస్వస్థత గురై హాస్పటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయాన్ని తెలుసుకొని పరమర్శించడానికి వచ్చి తమవంతు సహాయం చేసి కుటుంబాన్ని ఆదుకున్నారు. ఈ సందర్బంగా బహుజన అభ్యుదయ సేవా సమితి,హ్యూమన్ రైట్స్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ ఎస్ న్యూస్ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో ప్రజా గళాన్ని ప్రజలకు చేరవేస్తూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని శ్రీనివాస్ చేసిన సేవలను కొనియాడారు, శ్రీనివాసరావుకు అన్నివేళలా తమ తోడుగా ఉంటుందని కుటుంబానికి భరోసాని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆదూరి మణి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిల్లిముంత వెంకటేశ్వరావు, రాష్ట్ర కన్వినర్ కువ్వారపు విజయరావు లు పాల్గొన్నారు.