నేటి నుంచి నెమలి వేణుగోపాలుని ఆలయబ్రహ్మోత్సవాలు.
ఎన్టీఆర్ జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి ఆలయ 68వ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 17 వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
పయనించే సూర్యుడు మార్చి 13 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు నెమలి కృష్ణుడిని తమ ఇలవేల్పుగా భావిస్తూ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆరు రోజులపాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. ఏర్పాట్లను సహాయక కమిషనర్ ఎన్ సంధ్య ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. నేడు వేణుగోపాలుడిని పెండ్లి కుమారుడిగా అలంకరణ. 13న సాయంత్రం శేషవాహన మహోత్సవం. రాత్రి ఎదురుకోల ఉత్సవం. 14న రాత్రి 10 గంటలకు రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామి తిరు కళ్యాణం వేడుక. 15న రథోత్సవం. 16న ఉదయం వసంతోత్సవం. సాయంత్రం పల్లకి ఉత్సవం. రాత్రి కోనేరు లో తెప్పోత్సవం. 17న ద్వాదశ ప్రదక్షిణలు పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆలయ ప్రధాన అర్చకులు తిరునమరి గోపాలాచార్యాలు ఆధ్వర్యంలో రుత్విక బృందం బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు