
పయనించే సూర్యుడు ఫిబ్రవరి28 కడప డిస్ట్రిక్ట్ టీ సుండుపల్లె మండలం
పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మదీయసోదరులు ఎంతో నిష్టతో ఉండే ఉపవాస దీక్షల చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఇఫ్తార్ విందును NRI టీడీపీ కువైట్ ఆధ్వర్యములో కుదరవల్లి సుధాకర్ రావ్,పఠాన్ ఖాదర్ ఖాన్,మద్దిన ఈశ్వర్ నాయుడు ,కంచన రెడ్డి శేఖర్ గారు ఏర్పాటు చేశారు. ఫర్వానియా ప్రాంతంలో ఉన్న ఒమేరియా పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమములో కువైట్లోని పలు ప్రాంతాలనుండి వందలసంఖ్యలో తెలుగుదేశం మరియు జనసేన నాయకులు, మహిళలు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహమ్మదీయ సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియచేశారు. రంజాన్ మాసం అందరిలోను క్రమశిక్షణ, సహనం, మరియు దైవభక్తిని పెంపొందించే పవిత్ర మాసం. రంజాన్ శాంతి, సోదరభావం అనే సందేశాన్ని మరియు మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ఈ నెలలో అందరూ ఇతరుల పట్ల దయ, సానుభూతి, మరియు ప్రేమను ప్రదర్శిస్తారు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మైనార్టీల పక్షపాత పార్టీ అనీ, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పధకాలను మైనార్టీలకోసం ప్రవేశపెట్టారని పలువురు నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్నారై టిడిపి గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ శ్రీ కుదరవల్లి సుధాకర రావు, ఎన్నరై టిడిపి కువైట్ అధ్యక్షుడు శ్రీ మద్దిన ఈశ్వర్ నాయుడు, సుగవాసి యువసేన అధ్యక్షుడు శ్రీ కంచన రెడ్డి శేఖర్(ఎన్నరై టిడిపి )తెలుగు దేశం యువ నాయకులు శ్రీ పటాన్ ఖాదర్ ఖాన్, మాలేపాటి సురేష్ నాయుడు,కొల్లి ఆంజనేయులు, ఖాదరున్, వేణు రాజు, బిళ్ళా రమేష్ యాదవ్,గాజులపల్లి సుబ్బారెడ్డి, తిరుపతి రాజు, జిలాని బాషా, సుబ్రహ్మణ్యం , శ్రీ హరి నాయుడు,మహేష్ కోడూరి, చిన్నా రాజు, డాన్స్ మాస్టర్ వేణు,మహిళా నాయకురాలు బిళ్ళా గాయత్రి గారు గల్ఫ్ జనసేన నాయకులు గల్ఫ్ జాతీయ కన్వీనర్ శ్రీ కంచన శ్రీకాంత్, కువైట్ కన్వీనర్ శ్రీ ఆంజన కుమార్ పగడాల,శ్రీ ఆకుల రాజేష్, కువైట్ కో- కన్వీనర్స్ శ్రీ జగిలి ఓబులేష్,శ్రీ ఆలి షేక్, శ్రీ ఇమ్మిడిసెట్టి సూర్యనారయణ, కల్యాణి,ప్రేం రాయల్, చంద్రశెఖర్ తదితరులు పాల్గొన్నారు