▪️బీసీ రిజర్వేషన్.. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..
▪️ హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు..
పయనించే సూర్యడు // మార్చ్ // 19 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలుపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆద్వర్యంలో మోత్కులగూడెం చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గాంధీ చౌరస్తాలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సంధర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ విద్యా, ఉద్యోగ నియామకాల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ల పెంపుకు కృషి చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు 42శాతానికి పెంచుతామని రాహుల్ గాంధీ ఆనాడు హామీ ఇచ్చారని, బాధ్యతలు చేపట్టగానే 4ఫిబ్రవరి 2024లో బీసీ కులగణన ప్రక్రియను మొదలు పెట్టామన్నారు. బీసీ రిజర్వేషన్లు 37శాతానికి పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదన పంపితే దాన్ని ఉపసంహరించుకుని 42శాతం పెంచేందుకు కొత్త ప్రతిపాదన పంపిస్తున్నామని తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.