పయనించే సూర్యుడు న్యూస్ మోతె మండల ప్రతినిధి బి.వెంకన్న జనవరి 3)
వార్తా విశ్లేషణ సూర్యాపేట జిల్లా మోతె మండలం భల్లుతండా గ్రామంలోని ఎన్నికల కోడును ఉల్లంఘించిన గ్రామపంచాయతీ కార్యదర్శి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు మండలంలోని కొన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ నాయకులు ఫోటోలు పోస్టర్లు హోర్డింగులు ఎక్కడ ఉండకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని గ్రామపంచాయతీలో ఎన్నికల కోడ్ అమలు కావట్లేదు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు శిలాఫలకాలపై ఎలాంటి ముసుగులు వేయకుండా ఎవరైనా అడిగితే గాలికి ఎగిరిపోయినాయి కవర్లు అని చెబుతున్న పంచాయతీ కార్యదర్శి మంగళవారం భల్లు తండా గ్రామంలో శిలాఫలకాలు ఈ విధంగా వెలిశాయి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన ఇంకా తమ పంచాయతీల్లోని ప్రభుత్వ అధికారులకు సిబ్బందికి పట్టనట్లు ఉందని పలువురు యువకులు మండిపడుతున్నారు ఇప్పటికైనా శిలాఫలకాలపై ముసుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన పంచాయతీ కార్యదర్శిపై ఉన్నతాధికారులు ఇలాంటి సంఘటనలు మరెప్పుడూ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.