
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బిజెపి ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షుడు పిట్టల సురేష్
తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత
( పయనించే సూర్యుడు మార్చి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ లు అని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కింది,అందుకే ఇచ్చిన హామీలను నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల మేనిఫెస్టోను అమలు పరచాలని కోరుతూ శుక్రవారం ఫరూఖ్ నగర్ మండల తహసిల్దార్ కు బీజేపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు, ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పిట్టల సురేష్ మాట్లాడుతూ… ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో రాబోయే కాలంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసి ఆందోళనలు నిర్వహించి ప్రజల తరపున పోరాటం చేస్తాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.శివశంకర్, రెబ్బనమోని విష్ణు, జె.వినోద్ కుమార్,బి నరేష్,కృష్ణ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.