పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 23
స్వతంత్ర భారతం కోసం ఆదివాసీలు ఎన్నో పోరాటాలు,మరెన్నో ఉద్యమాల మధ్య ఎందరో వీరుల ప్రాణత్యాగాలు చేసారని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు స్పష్టం చేసారు.అడవిలో పుట్టి పెరిగిన ఆదివాసీలు అడవి మృగాలనుండి రక్షించుకోవడానికి ఆయుధాలు చేపట్టి ఈ ప్రపంచానికే పోరాటం నేర్పారు.బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా మొట్టమొదటిగా తిరుగుబాటు చేసి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముందున్నది ఆదివాసీలు.1767-1833 మధ్యకాలంలో జంగిల్ మహాల్ ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ ఆరాచకాలు పై ఛార్ తిరుగుబాటు,1770-1787లలో చిట్టాగాంగ్ కొండ ప్రాంతంలో చాక్మ తిరుగుబాటు,1774-1779లలో బస్తారు ప్రాంతంలో బ్రిటిష్ సైనికులు మరియు మరతా పైన హెల్బా ఆదివాసీలు తిరుగుబాటు,1776లో బ్రిటీష్ వారు విధించిన రెవెన్యూ పైన మరియు ఆర్ధిక దోపిడీపై చార్ తిరుగుబాటు, 1778లో రాజ్ మసాలా ప్రాంతంలో ఆదివాసీల భూమి ఆక్రమణ పై పిసినారి తిరుగుబాటు,1784లో బ్రిటీష్ వారు ఆదివాసీ వనరుల దోపిడీ పై బాబా తిల్కా మాంఝీ తిరుగుబాటు అనంతరం బాబా తిల్కా మింఝీ ని ఉరి తీయడం జరిగింది, 1784-85లలో మహారాష్ట్రలో మహాదన్ కోల్ ఆదివాసీలు తిరుగుబాటు,1789-1832 లలో తమరు బ్రిటిష్ తప్పడు ఎలైనుమెంట్ పద్దతి పై తిరుగుబాటు చేసారు. 1790లో ఈస్టిండియా కంపెనీ పై పానిపట్ వద్ద ఆదివాసీల తిరుగుబాటు,1818-1831 లలో బ్రిటీష్ కంపెనీ పాలనకు వ్యతిరేకంగా భిల్స్ భిల్ రాజు ఏర్పాటు చేసి 1831లో తిరుగుబాటు చేసారు.1820-37 బ్రిటిష్ వారి రెవెన్యూ విధానానికి వ్యతిరేకంగా చోటా నాగా పూర్ ఏరియాలో హెచ్ ఓ మల ముండా తిరుగుబాటు,1822-29లలో పశ్చిమ కనుమలలో రామోసి బ్రిటిష్ వారి ఆక్రమణ,1829లో గుజరాత్, మహారాష్ట్ర కోల్ ఆదివాసీలు బ్రిటీష్ కంపెనీ నియంత్రణ వ్యతిరేకంగా,1829,1839 మరియు 1844-48 మధ్య కాలంలో తిరురుగుబాటు చేసారు.1832లో భూమి పరాయికరణ, వడ్డీ వ్యాపారులపై, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా కోల్ ఆదివాసీల తిరుగుబాటు.1837-56లలో తమిళనాడు నుండి బెంగాల్ వరకు ఆదివాసీల కట్టుబాట్లు, సంస్కృతి,సాంప్రదాయాలపై బ్రిటీష్ వారి వ్యతిరేకపై తిరుగుబాటు,1855-56 జమీందార్లు,వడ్డీ వ్యాపారస్తులులపై సంతాల్ ఉద్యమం,1868లో మధ్యప్రదేశ్,గుజరాత్ లలో బ్రిటీష్, హిందూ కులం, ధర్మరాజు స్థాపనకు వ్యతిరేకంగా నైకాడా ఆదివాసీల తిరుగుబాటు,1870లో బీహార్ లో బ్రిటిష్ వారు రెవెన్యూ సెటిల్మేంట్ కు వ్యతిరేకంగా కార్ వార్ తిరుగుబాటు,1867లో భూయాన్ మరియు జుంగ్ ఒరిస్సా కాయిన్ జీరా బ్రిటిష్ వారి పొ రెండు సార్లు 1867,1891లలో తిరుగుబాటు చేసారు.1879-80 ఆంధ్రలో మొట్టమొదటి రంపా కోయ తిరుగుబాటు,1880లో అండమాన్ ప్రాంతంలో బ్రిటిష్ వారిపై సెంటినిల్స్ ఆదివాసీల తిరుగుబాటు,1890- 95 లూసీ ఆదివాసీలు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు,1891లోబ్రిటీష్ వారు ఆక్రమణ వలన ఆంగ్లీలు పూరి యుద్ధం,1899-1900 బ్రిటీష్ పాలన వలన బయట వారు ఆదివాసీ ప్రాంతంలోకి చొరబాట్లు వలన ముండా తిరుగుబాటు,1900 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దాబోర్ ప్రాంతంలో కొండదొర ప్రచారం,1910లో బ్రిటీష్ వారు భూస్వాముల విధానం,ఫారెస్ట్ పన్నులకు వ్యతిరేకంగా బస్తారు(జగదల్పూర్)లో తిరుగుబాటు,1914-19లలో ఛోటానాగపూర్ ప్రాంతంలో బ్రిటిష్ పాలనలో బయట వ్యక్తులు కలుగచేసుకోవడం వల్ల తానాభగత్,1921-22లలో ఆంధ్రలో నల్లమల ప్రాంతంలో బ్రిటిష్ ఫారెస్ట్ విధానంపై,1920-30లలో ఫారెస్ట్ బ్రిటిష్ భూఆక్రమణ పై చెంచు ఆదివాసీలు,1922-24లో ఆంధ్రలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రెండవ రంపా పితూరి(అల్లూరి సీతారామరాజు),1942లో కోరాపుట్ జయపూర్ లలో లక్ష్మణ నాయక్ ఆధ్వర్యంలో ఆదివాసి తిరుగుబాటు.ఈశాన్య భారతదేశంలో ఆదివాసీల తిరుగుబాటు
1828-33 లలో బర్మా యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు ఇచ్చిన మాట ప్రకారం ఓమ్ ఆస్థామ ప్రాంతాన్ని ఖాళీ చేయనందుకు,1830 జయంతా గారో కొండ ప్రాంతంపై బ్రిటిష్ వారు ఆక్రమణపై కాశీ తిరుగుబాటు,1830లో అస్సాంలో సింగపోస్ ను బ్రిటిష్ వారు ఆక్రమణపై,1905-31 మధ్య మణిపూర్ లో నాగ ఆదివాసీల తిరుగుబాటు, 1917-19 ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు లేబర్ రిక్రూట్మెంట్ విధానంపై మణిపూర్ లో కుక్కి ఆదివాసీల తిరుగుబాటు.1920 మణిపూర్ బ్రిటీష్ వారు కుక్కీలు హింస కాలంలో బ్రిటిష్ వారు రక్షణ కల్పించలేకపోవడం వల్ల జెలియన్ రంగ్ తిరుగుబాటు.1930లో రాణి గైదనీలు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా హెరకా తిరుగుబాటు.ఈ తిరుగుబాటులలో నాయకులు పాహరియాకు రాజజగన్నాధ్, చార్ కు దుర్జున్ సింగ్,తామరుకు బాలనాద్ సాయి, రామారావు సిత్తూరు సింగ్,హామ్ కు గొమదర్,కొల్ కు బుద్దో బగత్,సంతాల్ కు సిద్దు మరియు కునుహ,కోందు కు చక్ర్క బిసాయి,కొలి కు రామోజీ బంగ్రహా మగన్ లాల్ బుగన్,కోయ కీ తమ్మనదొర,జత్ర భగల్ కు తానా,రంపాకు అల్లూరి సీతారామరాజు,చెంచుకు వెంకటప్పయ్య,హనుమంతు,నాగకు రాణి గైయనిలు,భిల్ రాజు కు గోవింద్ గురు, రాజపరాహత్ కు హెచ్ ఓ ముండా, కార్ వార్ కు బాగ్రిత్ మాజీ, కాశీ తిరుగుబాటుకు తిరాత్ సింగ్,కొండదొర ప్రచారం కు కొర్రా మల్లయ్య లతో పాటు బిర్సాముండా, కొమరం భీం ఆదివాసీ పోరాటాలకు నాయకత్వం వహించిన నాయకులు.