పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 6. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
మా11% వాటా మాకు దక్కాల్సిందే.ఏన్కూర్ లో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యంగల నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నరేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ వర్గీకరణ కేటాయింపుల్లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. జనాభా దామాషా ప్రకారం చూస్తే 15 లక్షలు ఉన్న మాలలకు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు. అదే 32 లక్షలు ఉన్న మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చారు. 15 లక్షలు ఉన్న మాలలకు ఐదు శాతం వస్తే 32 లక్షలు ఉన్న మాదికులకు 11% రావాలి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వివేక్ ఇతర నాయకులు కుట్రలతోనే జనాభా దామాషా ప్రకారం వెనుకబడిన వర్గాల ప్రకారం చూసిన మాదికులకు 11% బదులుగా 9 శాతానికి తగ్గించి మాలలకు పెంచారన్నారు. అదేవిధంగా7తారీఖున జరగవలసిన వేల గొంతులు లక్షల డప్పులు కార్యక్రమాన్ని పరిమిషన్ ఇవ్వకపోవడం వల్ల వాయిదా వేశారని మరల త్వరలో డేట్ ప్రకటిస్తారని ఆ డేట్ కల్లా ఏనుకూరు మండలంలోని మాదిగలు అందరూ డప్పులు కొనుక్కొని సిద్ధంగా ఉండాలని అన్నారు.