//పయనించే సూర్యుడు//న్యూస్ అక్టోబర్ 10// నారాయణపేట జిల్లా బ్యూరో//
సామాజిక ఉద్యమాల పితామహుడు మందకృష్ణ మాదిగ ఆదేశాలు మేరకు MRPS, MSP, VHPS MEF,MSF,MMS,MJF,MLF,మరియు దళిత సంఘాల నారాయణపేట జిల్లా సమావేశం తేదీ 10-10-2025న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి మీద జరిగిన దాడిని నిరసిస్తూ చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేయడం మరియు శాంతియుతంగా నిరసన ర్యాలీ,ప్రదర్శన కార్యక్రమాలు విజయవంతం చేయడంపై చర్చించడం జరిగింది MRPS, జాతీయ నాయకులు నారాయణపేట జిల్లా ఇంచార్జీ మంద నరసింహ మాదిగ మాట్లాడుతూ ఏపార్టీ లో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా మన దళిత న్యాయవాది సుప్రీంకోర్టు జస్టిస్ వారి పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రజా సంఘాల నాయకులు ప్రతినిధులు అందరు కూడా13/10/2025నాడు సోమవారం రోజు నల్ల జండాల నిరసన ప్రదర్శనలు చేపట్టాలి అలాగే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం ఇవ్వాలని పిలుపునిచ్చారు అలాగే AYAM, KNPS, KVPS వివిధ ప్రజాసంఘాల నాయకులు తరలి రావాలనికోరారు ఈ కార్యక్రమంలో గుడిసె వెంకటయ్య msp జిల్లా అధ్యక్షుడు, MRPS నాయకులు రవి, హనుమంతు, జ్ఞాన ప్రకాష్, బోడి తేజ, ల్యాబ్ నరసింహ, పుత్ర సేన చిన్నయ్య, అశోక్, రంగ కృష్ణ, బాలరాజు, అంజి, నాగమ్మ,తదితరులు పాల్గొన్నారు