పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 16 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలుర మండలంలోని సాలుర గ్రామంలో దండోరా సంఘ నాయకులు డప్పులతో పిబ్రవరి 7వ తేదీన హైద్రబాద్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష డప్పుల, వేయి గొంతుకల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేపడుతున్న రథయాత్ర గురువారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించింది . దాంతో ఈ రథయాత్రలో పాల్గొనడానికి సాలూర మండలానికి చెందిన దండోర సంఘం నాయకులు డప్పులతో తరలివెళ్లారు .లక్ష డప్పుల వేయి గొంతుకల కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి మాదిగలు అధిక సంఖ్యలో తరలిరావాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సుభాష్,రవి,మరయ్య, లింబయ్య, సంతోష్, సాయిలు,పీరయ్య,పోశెట్టి తదితరులు పాల్గొన్నారు