పయనించే సూర్యుడు/జనవరి 18/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
యంగల నరేష్ మాదిగ
నిన్న ఏనుకూరులో జరిగిన ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సు విజయవంతంగా జరిగినందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ఏనుకూరులో నిన్న నిర్వహించిన ర్యాలీని సభను విజయవంతం చేసిన ఏనుకూరు మండలం మరియు ఖమ్మం జిల్లా నలుమూలల నుండి విచ్చేసి మాదిగల ఐక్యతను ఆకాంక్షను చాటిన నా మాదిగ తల్లులకు,అక్కలకు, చెల్లెమ్మలకు, పెద్దలు యువకులు, విద్యార్థులు ఈ సభ విజయవంతం కోసం గత ప్రతిరోజులుగా నిరంతరం శ్రమించిన ఏనుకూరు మండల యువకులకు పెద్దలకు మరీ ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు తగరం నరసింహారావు మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.మిత్రులారా మీరు చూపిన ఉత్సాహం ఎన్నటికీ మరిచిపోలేనిది. ఈ స్ఫూర్తిని ఫిబ్రవరి 7 వరకు కొనసాగించి లక్ష డప్పులు వేయి గొంతులో కళా ప్రదర్శనకు ఏన్కూరు మండలం నుండి అత్యధికంగా డబ్బులతో హైదరాబాద్ చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు తగరం నరసింహారావు మాదిగ, సీనియర్ నాయకులు ఇసనపల్లి కృష్ణ మాదిగ, msp మండల అధ్యక్షుడు దామెర్ల వీరయ్య మాదిగ, మాజీ మండల అధ్యక్షుడు పూర్ణకంటి నాగరాజు మాదిగ, గోరపుడి క్రాంతి మాదిగ, కొరకుప్పుల శ్రీను మాదిగ, కాంపెల్లి ప్రవీణ్ మాదిగ, మంగళ పూడి రాజ్ కుమార్ మాదిగ, మారుబత్తుల రాకేష్ మాదిగ. పిల్లల మరి రాకేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.