•కాంగ్రెస్ శ్రేణులపై తీవ్రస్త్రాయిలో విమర్శించిన కౌశిక్ రెడ్డి అభిమానులు,అనుచరులు
•ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దమ్మున్న నాయకుడు, రాష్ట్రస్థాయి నాయకుడు.
పయనించే సూర్యుడు : డిసెంబర్ 17 : హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి : హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీని గాడిదపై ఊరేగించి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విషయం విధితమే. అయితే ఈ విషయం తెలుసుకున్న భీఆర్ఎస్ పార్టీ అభిమానులు,ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచరులు తీవ్రమైన విమర్శలతో హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను పందిపై పెట్టి కూడా ఊరేగించగలం కానీ మాకు సంస్కారం ఉంది మాకు నైతిక విలువలు అడ్డుగా వస్తున్నాయి ప్రజాస్వామ్యంలో ధైర్యంగా ఎదుర్కోవాలి ఇలాంటి చిల్లర విషయాలు ఇప్పటికైనా మానుకోండి కౌశిక్ రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఈ వికృతమైన చేష్టలకు దిగుతున్నారు మీరెంత గింజుకున్నా మీ నాయకుడిని నాయకుడిగా ప్రజలు గుర్తించరు మీరు మాత్రమే నాయకుడిగా గుర్తించాలి ఇది సత్యం, మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కూడా మీ నాయకుడిని గుర్తించడం లేదు అన్నది సత్యం, మీ నాయకుడుని చూసి ప్రజలు. కాంగ్రెస్ పార్టీ నాయకులే జోకులు వేసుకుంటున్నారు. నాయకత్వ లక్షణాలు ఏమాత్రం లేవని అతడు అమ్ములు బేబీనే అనుకుంటున్నారని అని. కౌశిక్ రెడ్డి రాష్ట్రంలోనే అధికార పార్టీని గడగాడలాడిస్తున్న కౌశిక్ ను ఎదురుకునే దమ్ము ధైర్యం మీ నేతకు లేదు. మీరు ఎన్ని దిష్టిబొమ్మలు కాలబెట్టిన అయ్యేదేమీ లేదని కౌశిక్ వెనుక ప్రజలు ఉన్నారు. కచ్చితంగా ఆయన ప్రజాక్షేత్రంలో దూసుకుపోతారని ఆయనను అడ్డుకోవడం మీ వల్ల కాదు మీ ముఖ్యమంత్రి తోనే చెడుగుడు ఆడుతున్నాడని మీరెంత మీ లెక్కెంత అని విరుచుకుపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచాడు ఈసారి డిపాజిట్ కూడా రాదు రాసి పెట్టుకోండి మీ నాయకుడికి సింగపురం లోనే ఆయన ఇంటిలో లాలీపాప్ నోట్లో పెట్టి ఉయ్యాలలో పడుకోబెట్టి లాలి పాట పాడండి అని పరోక్షంగా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు పై విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది.సమస్యలపై పోరాటం చేసే సత్తా ప్రభుత్వాన్ని నిలదీసె సత్తా కౌశిక్ రెడ్డికే ఉన్నాయని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రాష్ట్రస్థాయి నాయకుడని పేర్కొన్నారు.అలాగే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీ కి అంబేద్కర్ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు.