పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న దృశ్యం…
రుద్రూర్, జూలై 16 (పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో లబ్ధిదారుడు షేక్ బురాన్ దంపతులు బుధవారం గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం భాధితులు మాట్లాడుతూ.. కటిక పేదరికంలో నివసిస్తున్న మా కుటుంబానికి తోడుగా నిలిచిన శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎల్లవేళల రుణపడి ఉంటామని, ఇంటి స్థలాన్ని కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాచిని కిష్టయ్య, కొండలరావు, ఫెరోస్ ఖాన్, షేక్ జమీర్, షేక్ మహబూబ్, యాసీన్ ఖాన్, అఫ్రోజ్ ఖాన్, మహమ్మద్ నయీముద్దీన్, మహమ్మద్ అక్రమ్, షేక్ రహీం, షేక్ సమీర్, షేక్ బిలాల్ తదితరులు పాల్గొన్నారు.