స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం వినతి..
పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనం కావాలి..
ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు సైతం.
లక్ష్మీదేవి పై స్పందించాలని మనవి.
( పయనించే సూర్యుడు జనవరి 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మేఘవత్ నరేందర్ నాయక్)
షాద్ నగర్ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పనులకు శ్రీకారం చుట్టాలని తెలంగాణ షాద్ నగర్ నియోజకవర్గ జేఏసీ, మేధావుల పూర్వ నాయకులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు విజ్ఞప్తి చేశారు. అధ్యక్షులు జనార్ధన్, కన్వీనర్ నక్క బాలరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, రాము ,అర్జున్ కుమార్, బాదేపల్లి సిద్ధార్థ, ఎం నర్సింలు ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ నియోజకవర్గంలో 500 వరకు పరిశ్రమలు ఉన్నాయని, మరెన్నో మల్టీ నేషనల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు అవుతున్నాయని గుర్తు చేశారు. ఆయా పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్యాల శిక్షణ కంపెనీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఒక్కటి యువతకు సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటే ఇక్కడికి యువత వలసలు పోతుందని గుర్తు చేశారు. ఇక అదే విధంగా మండలంలోని లింగారెడ్డి గూడా ప్రాంతంలో పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి సొంత భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరారు. నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై ఉన్న ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇక ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీటి సమస్యను తీర్చాలన్నారు. దీనికి సంబంధించిన వినతి పత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా పంపించినట్లు తెలిపారు..